- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'గోడలు కాదు బ్రిడ్జిలను నిర్మించండి'
దిశ,వెబ్‌డెస్క్: రైతుల్ని నిలువరించాలంటే ముళ్లతీగలు సరిపోవు బ్రిడ్జీలను నిర్మించండి అంటూ కేంద్రంపై రాహుల్ గాంధీ విరుచుకు పడ్డారు. వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనల్ని నిలువరించేందుకు ఘజీపూర్ బోర్డర్ సహా నగర సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లు, ముళ్లతీగల్ని ఏర్పాటు చేశారు. డ్రోన్‌లతోనూ నిఘా పెంచారు. మరోవైపు రైతు నిరసనలకు కేంద్రమైన ఢిల్లీ-హర్యానా బోర్డర్ సింఘులో పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో సిమెంట్‌తో కట్టిన గోడను పోలీసులు అమర్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బారికేడ్లు, ఇనుప తీగలతో కూడిన ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. రైతుల్ని నిలువరించాలంటే ‘గోడలు కాదు బ్రిడ్జిలను నిర్మించండ’ని కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సూచించారు.
GOI,
Build bridges, not walls! pic.twitter.com/C7gXKsUJAi
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2021