- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా ప్రశ్నలకు జవాబివ్వండి : రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్ :
రాఫెల్ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.నిన్న 5రాఫెల్ విమానాలు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో దిగాయి. వాటికి ఎయిర్ ఫోర్స్ ఛీప్ ఆర్‌ఎస్ బదౌరియా గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్‌కు శుభాకాంక్షలు చెబుతూనే.. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఒక్క జెట్‌కు రూ.526కోట్లు కాకుండా రూ.1670కోట్లు ఎందుకు వెచ్చించారో చెప్పాలని ప్రశ్నించారు. 126ఎయిర్ క్రాప్టుల కొనుగోలు డీల్ స్థానంలో 36మాత్రమే ఎందుకు కొన్నారు. రూ.30వేల కోట్ల కాంట్రాక్టును అనుభవం ఉన్నా హిందూస్థాన్ ఎరోనాటిక్స్ ప్రభుత్వ సంస్థకు ఇవ్వకుండా, దివాళా తీసిన అనిల్ అంబానీ కంపెనీకి ఎందుకు కట్టబెట్టారని అడిగారు. ఇదిలాఉండగా గతంలోనూ రాఫెల్ డీల్ సమయంలో రాహుల్ గాంధీ ఈ రకమైన ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే.