విజయసాయిరెడ్డిని గురి చూసి కొట్టిన రఘురామ

by srinivas |   ( Updated:2021-08-03 08:30:40.0  )
Vijayasai
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి షాక్ తగిలింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో తరచూ అధికారులను కలుస్తూ.. తనకు కేంద్రమంత్రులతో పరిచయాలు ఉన్నాయని తెలియజేస్తూ పరోక్షంగా భయపెట్టేందుకు.. కేసులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు జగన్ అక్రమాస్తుల కేసులో ప్రధాన దర్యాప్తు అధికారిగా పనిచేసిన అధికారిని సీబీఐ జేడీగా నియమిస్తున్న తరుణంలో నియమించవద్దంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయడాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. మరోవైపు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజు వ్యవహారంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరమన్నారు. అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని ప్రకటించడం చూస్తుంటే ఆయన న్యాయవ్యవస్థపట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవచ్చునని పిటిషన్‌లో ప్రస్తావించారు. జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించినందున బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఎంపీ రఘురామ కోరారు.

Advertisement

Next Story

Most Viewed