ఫోన్ ట్యాపింగ్‎పై అమిత్ షాకు ఫిర్యాదు

by Shyam |
ఫోన్ ట్యాపింగ్‎పై అమిత్ షాకు ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, మెదక్: తెలంగాణ ప్రభుత్వం త‌న ఫోన్‎తో పాటు త‌న సిబ్బంది ఫోన్ల‌ను ట్యాపింగ్ చేస్తుందంటూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్, కేంద్ర మంత్రి అమిత్‎షాకు దుబ్బాక బీజేపీ అభ్య‌ర్ధి రఘునంద‌న్ రావు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆదేశాల మేర‌కు రాష్ట్ర పోలీసులు ఇలా చేస్తున్నారని.. దీనిపై జోక్యం చేసుకుని ఫోన్ ట్యాపింగ్ విషయంపై చర్యలు తీసుకోవాలని మెయిల్ ద్వారా ర‌ఘునంద‌న్ రావు కోరారు.

రాజ్యాంగ విరుద్ధంగా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేయటం సరికాదన్నారు రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ అధికారిక ప్రతినిధి, న్యాయవాదిగా ఉన్న తనపై రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాజకీయ అభ్యర్థుల రాజకీయ ప్రయోజనం కోసం టెలిఫోన్ ట్యాపింగ్ చేయటం చట్టవిరుద్ధమని.. ట్యాపింగ్‌కు పాల్పడిన వారిపై అధికారిక విచారణకు ఆదేశించాలని అమిత్ షాను కోరారు.

Advertisement

Next Story

Most Viewed