- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"రఘునందన్ రావు 12 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నారు"
వాక్చాతుర్యంతో తిమ్మిని బమ్మి చేయగల బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి, అడ్వకేట్ రఘునందన్‌రావుపై అత్యాచారం కేసు నమోదుకావడం సంచనం రేగుతోంది. బాధితురాలు రఘునందన్‌రావు తనపై 12 ఏళ్లుగా అత్యాచార పర్వం కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో…
రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతినగర్‌కు చెందిన ఆమె 2003లో భర్తపై పోలీస్ స్టేషన్‌లో గృహ హింస కింద కేసు పెట్టింది. ఈ కేసు వాదించేందుకు పటాన్‌చెరులో అడ్వకేట్ రఘునందన్‌రావును సంప్రదించి.. పోషణ ఖర్చుల కోసం భర్తపై సంగారెడ్డి కోర్టులో కేసు (నం.16/2003) వేసింది. వాదోపవాదాలు దగ్గరపడ్డాయని చెబుతూ 2007 డిసెంబరు 2న… మీ కేసు గురించి మాట్లాడేందుకు ఆఫీసుకు రావాలంటూ రఘునందన్ ఆమెను పిలిచారు.
కేసు విషయం చర్చిస్తుండగా ఇంట్లోకి వెళ్లి కాఫీ తెచ్చి ఇచ్చారు. అది తాగిన వెంటనే కళ్లు తిరుగుతున్నట్లు అనిపించిందని చెప్పడంతో, ఆమెను ఆయన గదిలోకి తీసుకెళ్లబోగా అతనిని విడిపించుకునేందుకు పెనుగులాడింది. అయినప్పటికీ వదలని ఆయన.. ఆమెను గట్టిగా పట్టుకుని గదిలోకి తీసుకెళ్లారు. మెలకువ వచ్చాక తనపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న ఆమె రఘునందన్‌ను నిలదీయగా, ‘పోలీసు కేసు పెట్టినా, విషయం ఎవరికైనా చెప్పినా చంపేస్తా. నీ నగ్న చిత్రాలు నా దగ్గరున్నాయి. వాటిని ఇంటర్నెట్‌లో పెట్టి నీ జీవితాన్ని నాశనం చేస్తానం’టూ ఆమెను బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే రాజకీయ పలుకుబడితో, రౌడీలతో బెదిరించినట్టు ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. గతేడాది మార్చిలో రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు (ఎస్‌ఆర్ 998/2019) చేయగా కేసు నమోదు చేసి, చర్య తీసుకోవాలని గత నెల 23న రామచంద్రాపురం పోలీసులను ఆదేశించింది. అనంతరం ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు సీపీ సజ్జనార్‌ను ఆశ్రయించింది. దీంతో ఆర్సీపురం పోలీసులను కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు.
అయితే అత్యాచారం ఆరోపణలను రఘునందన్‌రావ్ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నించేవారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టే కుట్ర చేస్తోందని రఘునందన్‌రావు ఆరోపించారు. దీనిపై హెచ్‌ఆర్‌సీకి వెళ్లి ఫిర్యాదు పత్రాలు తీసుకుంటానని ఆయన తెలిపారు.