ఆ చిన్నారిని చూడాలని ఉంది: లారెన్స్

by Shyam |   ( Updated:2020-05-18 02:16:00.0  )
ఆ చిన్నారిని చూడాలని ఉంది: లారెన్స్
X

ఇతరుల కష్టాల్లో పాలు పంచుకుని.. వారి బాధలను దూరం చేయాలనే మనస్తత్వం కొంత మందిలో మాత్రమే ఉంటుంది. అలాంటి జాలి, కరుణ కలిగిన మానవత్వం ఉన్న మనుషుల్లో నటుడు రాఘవ లారెన్స్ ఒకరు. కరోనా కారణంగా నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ ఖాళీ కడుపుతో జీవితాన్ని గడుపుతున్నారని తెలిసి చలించిపోయాడు. తన దగ్గర ఉన్న మొత్తాన్ని విరాళంగా అందించాడు. ఇతర ప్రముఖులను తన సేవాకార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ… పేదలు, అనాథల కడుపు నింపుతున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో చూసి గొప్ప అవార్డు పొందిన ఫీలింగ్ కలిగిందని తెలిపాడు లారెన్స్. తమిళనాడులోని కాయిపక్కం గ్రామంలో లారెన్స్ సేవ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. అందులో భాగంగా భోజనం పాకెట్ తీసుకున్న ఓ చిన్నారి.. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బ్యానర్ పై ఉన్న లారెన్స్ ఫోటోకు థాంక్స్ చెప్తూ ముద్దు పెట్టాడు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. లారెన్స్ వరకు చేరింది. దీంతో చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు.. నిజంగా నన్ను దేవుడే దిగివచ్చి ఆశీర్వదించినట్లు అనిపిస్తుంది. నేను మనస్ఫూర్తిగా, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. ఇలాంటి కల్మషం లేని ప్రేమను చూస్తే మరింత సేవ చేసుకోవాలని అనిపిస్తుంది అన్నారు లారెన్స్. నాపై ఇంత ప్రేమ కురిపించిన ఆ చిన్నారికి ధన్యవాదాలు.. ఆ బుడ్డోడిని తప్పకుండా కలుస్తాను అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed