2022లోపు సైన్యంలోకి 36 రాఫెల్ జెట్లు: ఐఏఎఫ్ చీఫ్

by Shamantha N |   ( Updated:2021-06-19 09:34:16.0  )
2022లోపు సైన్యంలోకి 36 రాఫెల్ జెట్లు: ఐఏఎఫ్ చీఫ్
X

న్యూఢిల్లీ: ముందుగా నిర్దేశించుకున్నట్టుగానే వచ్చే ఏడాదిలోపే 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత సైన్యంలోకి చేరతాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్‌కేఎస్ బధౌరియా అన్నారు. ‘టార్గెట్ 2022. అందులో మార్పు లేదు. కొవిడ్ కారణంగా ఒకట్రెండు విమానాలు ఆలస్యం కావచ్చు. కానీ, కొన్ని జెట్లు నిర్ణయించుకున్న షెడ్యూల్ కంటే ముందే డెలివరీ అవుతున్నాయి. కాబట్టి, ఓవరాల్‌గా రాఫెల్ రాకలో మార్పు లేదు. ఇప్పటి వరకు 11 రాఫెల్ జెట్లు మనదేశానికి చేరాయి. ఈ మార్చిలోపు 17 రాఫెల్ జెట్లు మన గడ్డపై ఉంటాయి’ అని వివరించారు. లడాఖ్‌లో ఇండో చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై ప్రశ్నలు వేయగా, ఇరువైపులా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల తగ్గింపునకు చర్యలు ఉంటాయని తెలిపారు.

Advertisement

Next Story