టెన్నిస్ ప్రపంచం 2020ని కోల్పోయింది : నాదల్

by Shyam |
టెన్నిస్ ప్రపంచం 2020ని కోల్పోయింది : నాదల్
X

మాడ్రిడ్: కరోనా మహమ్మారి కారణంగా టెన్నిస్ ప్రపంచం 2020 సంవత్సరాన్ని కోల్పోయిందని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అభిప్రాయపడ్డాడు. కాగా, వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌తోనే తిరిగి టెన్నిస్ ప్రారంభమవుతుందేమోనని నాదల్ అభిప్రాయపడ్డాడు. ప్రముఖ స్పానిష్ దినత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాదల్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ నాకే కనుక అధికారాలు ఉంటే ఈ ఏడాదిలో ఇక టెన్నిస్ ఆడకుండా సంతకం చేసేస్తానని.. క్రీడాకారులందరూ ఫ్రెష్‌గా వచ్చే ఏడాది నుంచి ఆటను మొదలు పెట్టడమే మంచిదని’ నాదల్ సూచించాడు. ‘చాలా బిజీగా ఉండే టెన్నిస్ క్రీడాకారులు, సహాయక సిబ్బంది.. అతి తక్కువ సమయంలోనే ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ కరోనా సంక్షోభ సమయంలో అది ఏ మాత్రం వీలు కాదు. కాబట్టి వచ్చే ఏడాది క్రీడను ప్రారంభిస్తేనే ఆటగాళ్లు, ప్రేక్షకుల ఆరోగ్యాలకు మంచిదని’ తెలిపాడు.

టెన్నిస్ మాత్రమే కాదు ప్రపంచలోని ప్రజలంతా ఒక ఏడాదిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని నాదల్ ఆవేదన చెందారు. ‘ఆటను మెరుగుపరుచుకోవడంతో పాటు గాయాల నుంచి కోలుకునేందుకు ఈ సమయం చాలా ఉపయోగపడుతుందన్నాడు. ఆట ఆడట్లేదని అలసత్వం వహించడకుండా ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవడం, ఆటను మరింత ప్రాక్టీస్ చేయడం మంచిదని నాదల్ సూచించాడు. ‘ఈ ఏడాది ముగిసేలోపే టెన్నిస్‌ పోటీలు మళ్లీ ప్రారంభం కావాలని నేను ఆశిస్తున్నా.. కానీ అలా జరుగుతుందని అనుకోవడం లేదు. 2021 కోసం నేను సిద్ధమవుతున్నా’ అని నాదల్‌ చెప్పాడు.

Tags : Rafael Nadal, Tennis, Coronavirus, Covid 19

Advertisement

Next Story

Most Viewed