నేను ఏ ఆటగాడిని బెదిరించలేదు : రఫేల్ నదాల్

by Shyam |
నేను ఏ ఆటగాడిని బెదిరించలేదు : రఫేల్ నదాల్
X

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజ క్రీడాకారుల్లో ఒకరిగా పిలవబడుతున్న రఫేల్ నదాల్‌పై ఇటీవల పలువురు క్రీడాకారులు ఆరోపణలు చేశారు. లాకర్ రూమ్‌లో (క్రికెట్‌లో డ్రెస్సింగ్ రూం లాంటిదే) అతడు ఇతర క్రీడాకారులను బెదిరించే విధంగా గట్టిగా మాట్లాడుతుంటాడనే విమర్శలు ఉన్నాయి.

దీనిపై నదాల్ స్పందిస్తూ.. ‘తాను ఏనాడూ లాకర్ రూమ్‌లో గట్టిగా అరవలేదు. అక్కడ నేను చాలా సైలెంట్‌గా ఉంటాను. ఇయర్ ఫోన్‌లో మ్యూజిక్ వింటూ ప్రశాంతంగా గడపడానికే ప్రయత్నిస్తాను. అయితే నా ప్రత్యర్థులతో మాట్లాడటానికి మాత్రం ఇష్టపడను’ అని చెప్పాడు. నదాల్‌ తన ప్రత్యర్థి మంచి షాట్లు ఆడితే మెచ్చుకోడనే దానిపై కూడా వివరణ ఇచ్చాడు. ఆటన్నాక అందరూ మంచి ర్యాలీలు ఆడతారు. మంచి గేమ్స్ గెలుస్తారు. ప్రతీసారి వారిని మెచ్చుకుంటే నన్ను నేను తగ్గించుకున్నట్లు అవుతుంది. అందుకే నేను ఎక్కువగా మెచ్చుకోను అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story