‘రాధే శ్యామ్’ న్యూ ఇయర్ ట్రీట్‌

by Shyam |
‘రాధే శ్యామ్’ న్యూ ఇయర్ ట్రీట్‌
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్‌’ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేసి న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది మూవీ యూనిట్. సరస్సు పక్కన కూర్చున్న డార్లింగ్ స్టైలిష్ లుక్ ఎప్పటిలాగే అదిరిపోగా.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మార్చి 30న విడుదల చేయనున్నారని సమాచారం. గోపీ కృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, టి సిరీస్ నిర్మిస్తున్న సినిమాకు ‘జిల్ ఫేమ్’ రాధాకృష్ణ కుమార్ దర్శకులు కాగా.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న పిరియాడికల్ డ్రామా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. మీ మనసు దోచుకునేందుకు ‘రాధే శ్యామ్’ మళ్లీ వచ్చేస్తున్నాడు అంటూ ఫొటోస్ షేర్ చేసింది మూవీ యూనిట్.

Advertisement

Next Story