రూ. 100 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన రాధా స్మెల్టర్స్!

by Harish |
radha tmt
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టీఎమ్‌టీ స్టీల్ బార్ తయారీ సంస్థ రాధా స్మెల్టర్స్ 2025 నాటికి తన సామర్థ్యాన్ని ఏడాదికి 4 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులకు పెంచనున్నట్టు వెల్లడించింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు దాదాపు రూ. 100 కోట్ల పెట్టుబడుల ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని మెదక్ జిల్లా చిన్న శంకరంపేట యూనిట్‌లో ఈ సామర్థ్య విస్తరించనున్నామని, దీని ద్వారా దేశీయంగా తమ వాటా పెంచుకోవాలని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీ తన కొత్త 550డీ ఎల్ఆర్ఎఫ్ టీఎమ్‌టీ స్టీల్ బార్డ్6లను గురువారం ప్రారంభించింది.

ఇది అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఎత్తైన భవనాల వినియోగానికి ఉపయోగపడుతుంది. ఇవి భూకంపాలు వచ్చే పరిస్థితులు సైతం తట్టుకోగలవు. వీటి ఉత్పత్తి కోసం కంపెనీ రూ. 75 కోట్ల పెట్టుబడులను పెట్టింది. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,500 కోట్ల విలువైన అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020-21లో కంపెనీ రూ. 530 కోట్లు, 2021-22 లో రూ. 1,000 కోట్ల టర్నోవర్ సాధించినట్టు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed