రాచకొండ సీపీకి అరుదైన బహుమతి

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని రాచకొండ చారిత్రక వైభవాన్ని తెలిపే చిత్రపటాని సీపీ మహేశ్ భగవత్‌కు రాచప్ప సమితి సభ్యులు బహూకరించారు. చిత్ర కళాకారుడు నర్సింగ్‌రావు ఈ చిత్రపటాన్ని రూపొందించారు. రాచకొండ ప్రాంత అభివృద్ధికి కమిషనర్ నిరంతరం కృషి చేస్తున్నట్లు రాచప్ప సమితి సభ్యులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాచప్ప సమితి ప్రధాన కార్యదర్శి సూరేపల్లి వెంకటేష్, ప్రధాన సలహాదారుడు కడారి అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు కేశెట్టి దశరథ, కోశాధికారి నిమ్మల నగేష్, జక్కిడి మధు సూధన్ రెడ్డి, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

Advertisement