- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాచకొండ పోలీసుల స్పోర్ట్స్ మీట్ అదుర్స్
దిశ, ఎల్బీనగర్: పోలీసుల స్పోర్ట్స్ మీట్ సిబ్బందిలో నూతన ఉత్సహం నింపుతుందని రాచకొండ పోలీస్ కమిషన్ మహేష్ భగవత్ సంతోషం వ్యక్తం చేశారు. సరూర్‌నగర్ స్టేడియంలో రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో 4వ వార్షిక స్పోర్ట్స్ మీట్ – 2021ను ఐపీఎస్ రవిగుప్త, రాచకొండ సీపీ మహేష్ భగవత్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ రవిగుప్త మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరెట్ పరిధిలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాచకొండ పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. కోవిడ్ తరువాత నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ సిబ్బందిలో నూతన ఉత్సాహం నింపుతుందన్నారు. నాలుగు రోజుల పాటు ఈ క్రీడలు కొనసాగునున్నాయని తెలిపారు. మొత్తం 35 రకాల క్రీడలు జరుపుతున్నామని, రాచకొండ కమిషనరెట్ పరిధిలో ఇది నాలుగవ వార్షిక స్పోర్ట్స్ మీట్ అని వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన మీడియాతో రాచకొండ పోలీసుల ప్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉందని, ఇందులో మీడియా మిత్రులందరూ పాల్గొన్నాలని కోరారు. క్రీడల చివరి రోజు కార్యక్రమానికి ఫైనాన్స్ హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు హాజరవుతారని తెలిపారు. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, పోలీసు వ్యవస్థలో ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం కోసం ఇవి దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
- Tags
- mahesh bhagwat