మహిళ కాళ్లు మొక్కిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ (వీడియో)

by Shyam |   ( Updated:2023-10-10 16:48:09.0  )
Mahesh Bhagwat
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషరేట్లలో, బెటాలియన్లు, పోలీస్ స్టేషన్లలో ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసు అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్‌లో అనూహ్యంగా జరిగిన ఓ సంఘటనపై నెట్టింట చర్చ నడుస్తోంది.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరుల కుటుంబాలను సీపీ మహేష్ భగవత్ ఒక్కొక్కరిని కలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళను సన్మానిస్తుండగా ఆమె కన్నీటిపర్యతం అయింది. ఆమెకు నూతన వస్త్రాలు అందజేసిన సీపీ ఆ మహిళ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సీపీ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story