రబీకి 121 రోజులు సాగునీరిస్తాం

by srinivas |
రబీకి 121 రోజులు సాగునీరిస్తాం
X

దిశ, ఏపీ బ్యూరో: రబీ పంటలకు 121 రోజులపాటు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. కాకినాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సాగునీటితోపాటు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన రూ.277 కోట్ల బకాయిలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

వైఎస్సార్​ ఉచిత పంటల బీమా పథకం కింద ఇప్పటివరకు 30 రకాల పంటలను నోటిఫై చేసినట్లు తెలియజేశారు. సాగుదారులు తప్పనిసరిగా ఈ క్రాప్​లో నమోదు చేయించుకోవాలని సూచించారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రైతుల బీమా సొమ్మును కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు సాయం చేసేందుకు గ్రామస్థాయిలో సలహా కమిటీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

Advertisement

Next Story