రైతు బంద్‌కు జైకొట్టిన నారాయణమూర్తి

by Shamantha N |
రైతు బంద్‌కు జైకొట్టిన నారాయణమూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్ : రైతు బంద్‌కు మద్దతు తెలిపారు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి. వ్యవసాయరంగంలో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్నదాతల ఆందోళనలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రైతును రాజుగానే బతకనివ్వాలని.. బానిసగా మార్చకూడదని విజ్ఞప్తి చేశారు. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రధాని మోడీని కోరారు. ఎం.ఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని అభ్యర్థించారు.

Advertisement

Next Story

Most Viewed