"రైతన్న" సినిమాను ఆదరించండి : ఆర్. నారాయణ మూర్తి

by Sridhar Babu |
రైతన్న సినిమాను ఆదరించండి : ఆర్. నారాయణ మూర్తి
X

దిశ, కల్లూరు(సత్తుపల్లి): కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టనున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వాస్తవిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఆర్. నారాయణ మూర్తి రైతన్న సినిమా నిర్మించారు. ఈ నెల 22న విడుదల కానున్న “రైతన్న” చిత్రాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు వీక్షించాలని కోరారు. చిత్ర ప్రచారానికి సత్తుపల్లి విచ్చేసిన ఆర్. నారాయణ మూర్తిని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు. అలాగే చిత్రం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలలో రైతులు పంట మార్కెట్ ను రద్దు చేయడం, పంట మోటార్లకు మీటర్లు బిగించడం, ఎరువుల పై ఆంక్షలు, ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు విధించటం వంటి చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 9 నెలలుగా రైతులు చేపడుతున్న ఉద్యమాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి అన్ని అంశాలను రూపుదిద్దుతూ ప్రజలకు తెలియపరిచే విధంగా ఆర్ నారాయణ మూర్తి ఈ సినిమా తీశారని, ఈ చిత్రాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు చూడాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed