- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతన్న సినిమాను ఆదరించండి : ఆర్.నారాయణ మూర్తి
దిశ, చౌటుప్పల్: రైతుల సమస్యలపై తీసిన ‘రైతన్న’ సినిమాను అందరూ ఆదరించాలని సినీ హీరో, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి కోరారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని సీపీఎం కార్యాలయానికి ఆర్.నారాయణ మూర్తి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీపీఎం నేతలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కరోనాను, చలిని లెక్కచేయకుండా రైతులు కొన్ని నెలలుగా పోరాటం చేస్తోన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఈ పోరాటంలో ఇప్పటికే సుమారు ఆరు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాల వల్ల ఏర్పడే నష్టం గురించి ‘రైతన్న’ సినిమాలో క్లుప్తంగా వివరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దోనూరి నర్సిరెడ్డి, రొడ్డ అంజయ్య, గోశిక స్వామి, గంగాదేవి సైదులు, గోశిక కరుణాకర్, మదార్, వెంకటేష్, రాగిరి కిష్టయ్య, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.