- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వుహాన్ చిచ్చరపిడుగులు.. ఏం చేశారంటే…
దిశ, వెబ్‌డెస్క్:
చైనాలోని వుహాన్ ప్రావిన్స్‌లో కరోనా వైరస్ మొదటగా బయటపడిన సంగతి తెలిసిందే. గత నెలన్నర రోజులుగా అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మార్కెట్లు మూతపడ్డాయి. తుమ్మినా.. దగ్గినా.. క్వారంటైన్ జోన్‌కి పంపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అక్కడి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో పిల్లలు ఎగిరి గంతేసి, ఇంట్లోనే కార్టూన్లు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారి ఆశలను అడియాశలు చేస్తూ స్కూళ్లన్నీ టెక్నాలజీ సాయం తీసుకున్నాయి.
ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు పాఠాలు చెప్పి, హోంవర్క్ చేయించడానికి ఉపయోగపడే డింగ్ టాక్ అనే యాప్ ద్వారా క్లాసులు వినాలని విద్యార్థులను ఆదేశించాయి. ఇక చేసేది లేక వారు ఇంట్లో తరగతులు వింటున్నారనుకుంటే పొరపాటే… అసలే ఈ కాలం పిల్లలు చాలా తెలివైనవారు. టెక్నాలజీ గురించి చిన్నవయసు నుంచే చాలా జ్ఞానం కలిగి ఉంటున్నారు. వారి ఆనందాన్ని అడ్డుకుంటున్న డింగ్ టాక్ యాప్‌కి బుద్ధి చెప్పాలనుకున్నారు.
అంతే.. యాప్ స్టోర్‌లో ఆ యాప్‌కి తక్కువ రేటింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. రేటింగ్ మాత్రమే కాదు.. బ్యాడ్ రివ్యూలు కూడా ఇచ్చారు. దీంతో 4.9 ఉన్న రేటింగ్ కాస్త 1.4కి పడిపోయింది. 1 కంటే తక్కువ రేటింగ్ ఉన్న యాప్‌లను యాప్ స్టోర్ ఆఫ్‌లైన్ చేసేస్తుంది. ఈ లాజిక్ తెలుసుకుని ఈ వుహాన్ చిచ్చరపిడుగులు చేసిన పనికి డింగ్ టాక్ కంపెనీ బతిమాలాడే పని మొదలుపెట్టింది. ‘ప్లీజ్, మా యాప్ వచ్చి ఇంకా ఐదేళ్లు కూడా కాలేదు. దయచేసి మమ్మల్ని చంపకండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. పిల్లల ఆనందంతో పెట్టుకుంటే అలాగే ఉంటది మరి!
tags: Corona, COVID 19, Wuhan, China, DingTalk, Education app, Kids, App Store