‘సరళ సాగర్ కరకట్ట నిర్మాణంలో నాణ్యత లోపం’

by Shyam |
‘సరళ సాగర్ కరకట్ట నిర్మాణంలో నాణ్యత లోపం’
X

దిశ, మహబూబ్‌నగర్: సరళ సాగర ప్రాజెక్టు కరకట్ట నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదని, లోపభూయిష్టంగా నిర్మిస్తున్న కరకట్టపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి కరకట్ట నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2019 డిసెంబర్ నెలలో గండిపడిన సరళ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన కరకట్ట నిర్మాణం పేరుతో ఇసుకను, మట్టిని అక్రమంగా తరలిస్తూ, స్థానిక ఎమ్మెల్యే ఇసుకాసురునిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు తెగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ మొసలి కన్నీరు కార్చుతూ.. ఎలాంటి నాణ్యత లేకుండా కరకట్టను నిర్మిస్తుండడం రైతులను మోసం చేయడమేనన్నారు. అధికార బలంతో నాయకులు ప్రాజెక్టులోని ఇసుకను, మట్టిని అక్రమంగా తోడుతున్నా కూడా అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని, అధికారులు ప్రజల కోసం పని చేయాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed