సెమీస్‌లో ఓడిన పీవీ సింధు

by Shiva |
సెమీస్‌లో ఓడిన పీవీ సింధు
X

దిశ, స్పోర్ట్స్ : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పరాజయం పాలైంది. ఈ టోర్నీలో అసాధారణ ప్రతిభ కనపరుస్తూ వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ వస్తున్న పీవీ సింధు జైత్రయాత్రకు థాయ్‌లాండ్‌కు చెందిన చోచూవాంగ్ బ్రేక్ వేసింది. శనివారం జరిగిన సెమీస్‌లో 17-21, 9-21 తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్‌లో ఏ సమయంలోనూ పీవీ సింధు ప్రత్యర్ధిపై ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. మరోవైపు చోచువాంగ్ డ్రాప్, స్మాష్ షాట్లతో సింధును ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలి గేమ్‌లో కాస్త పోరాడిన పీవీ సింధు.. రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ఈ ఏడాది స్విస్ ఓపెన్ ఫైనల్‌లో కూడా పీవీ సింధు ఓడిపోయింది. దీంతో ఆల్ ఇంగ్లాండ్‌లో భారత షట్లర్ల ప్రస్థానం ముగిసింది.

అంతకు ముందు శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో పీవీ సింధు యమగుచిపై 16-21, 21-16, 21-19తో గెలిచింది. అసాధారణ పోరాటం కనపర్చిన పీవీ సింధు.. సెమీస్‌లో మాత్రం ప్రత్యర్థి చేతితో తలొగ్గింది.

Advertisement

Next Story

Most Viewed