- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BWF వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో పీవీ సింధు
దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టైటిల్ గెలవడానికి అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2021 సెమీఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచిపై అద్భుత విజయం సాధించి ఫైనల్ చేరుకున్నది. యమగుచితో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు నువ్వా నేనా అన్నట్లు తలపడింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో మూడు గేమ్స్ కూడా పోటాపోటీగా జరిగాయి. తొలి గేమ్‌ను పీవీ సింధు 21-15 తేడాతో గెలిచింది. అయితే రెండో గేమ్‌లో యమగూచి పుంజుకున్నది.
ఆ గేమ్‌ను 15-21 తేడాతో కోల్పోయిన సింధు.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తీవ్రంగా పోరాడింది. చివరకు 21-19తో కైవసం చేసుకొని పీవీ సింధు మూడో సారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ తుది అంకానికి చేరుకున్నది. 2018లో పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ టైటిల్ గెలిచింది. కాగా, ఆదివారం జరుగనున్న ఫైనల్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన అన్ సియాంగ్‌తో తలపడనున్నది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు లక్ష్య సేన్ ఓడిపోయాడు. ఒలింపిక్ చాంపియన్, డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సల్‌సెన్‌పై 13-21, 11-21 తేడాతో ఓడిపోయాడు. పురుషుల ఫైనల్స్‌లో అక్సల్‌సెన్.. కున్లవుత్ విటిడ్‌సర్న్‌తో తలపడతాడు.