‘నిమిషం పాటు ఊపిరి బిగపడితే.. కరోనా లేనట్టే’

by Shamantha N |
‘నిమిషం పాటు ఊపిరి బిగపడితే.. కరోనా లేనట్టే’
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరీక్షలు చేయడానికి టెస్టింగ్ కిట్లు సరిపోక విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే.. యోగా గురు రాందేవ్ బాబా మాత్రం ఊపిరిబిగపట్టి కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చునంటున్నారు. ‘నిమిషం పాటు ఊపిరిబిగపట్టి ఉండగలిగితే ఆ వ్యక్తిలో కరోనా లేదని అర్థం’ అని చెబుతున్నారు. ఈ-ఎజెండా ఆజ్ తక్‌లో జరిగిన ప్రత్యేక సెషన్‌లో రాందేవ్ మాట్లాడుతూ.. ‘గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారు, వృద్ధులు 30సెకండ్ల పాటు, యువత నిమిషం పాటు ఊపిరి బిగపట్టి ఉండగలిగితే వారిలో కరోనా లేదని అర్థం. అలాగే, ‘ఉజ్జయి’ ప్రాణాయామంతో కరోనాను ఎదుర్కొవచ్చు. ‘ఉజ్జయి’ ప్రాణాయామం చేయడంతో పాటు, ఆవ నూనెను ముక్కు ద్వారా తీసుకుంటే మీలో కరోనా వైరస్ ఉన్నట్టయితే, నూనెతో పాటు వాయుమార్గం గుండా ఆ వైరస్ కడుపులోకి జారుకుంటుంది. అనంతరం కడుపులో విడుదలయ్యే ఆమ్లాలు వైరస్‌ను చంపేస్తాయి’ అని అన్నారు. అనేక జబ్బులు రావడానికి ముఖ్యకారణం శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడమేననీ, ఇది పలు అధ్యయనాల్లోనూ వెల్లడైందని చెప్పారు. కావున, ప్రతిరోజూ యోగా చేయాలనీ, అలా చేస్తే రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కొనే శక్తి శరీరానికి లభిస్తుందని తెలిపారు.

Tags: corona, virus, ramdev baba, aaj tak, ujjayi, pranayama, corona test, hold breath for one minute, corona test, yoga guru,

Advertisement

Next Story

Most Viewed