- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ దమ్ము.. కొద్దిమందికే ఉంటుంది : పూరి
దిశ, వెబ్‌డెస్క్ :
తన పదునైన మాటలతో ప్రేక్షకులకు కిక్ ఇచ్చే పూరీ జగన్నాథ్.. తన సినిమా ఎలా ఉన్నా సరే, డైలాగ్స్‌తో మాత్రం అదరగొడతారనేది తెలిసిందే. ఆయన సినిమాల్లోని డైలాగ్స్‌కు మాత్రమే ప్రత్యేకంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే, సినిమాల్లో అన్ని విషయాలను చెప్పలేం కదా. అందుకే పూరి తన మనసులోని భావాలను ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో పోడ్‌కాస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా టాపిక్స్‌పై తనదైన స్టైల్‌లో అభిప్రాయాలను వెల్లడించిన పూరి.. తాజాగా ‘సూసైడ్’ మీద ఓ అద్భుతమైన ఆడియో విడుదల చేశారు.
‘లైఫ్‌లో ఎన్నోసార్లు మన మీద మనకే చిరాకు దొబ్బుతుంది. ఛీ.. ఎదవ జీవితం అని చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటి సూసైడ్ ఆలోచనలు వచ్చినవాళ్లంటే.. నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే.. ‘ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అయినా ఎందుకు చావాలనుకుంటున్నారు? ఫైనాన్షియల్, ఫ్యామిలీ ఇంకా ఏవో కారణాలు కావచ్చు. బాధ్యత తీసుకున్నవాళ్లు మాత్రమే ఇలా ఆలోచిస్తారు. బాధ్యతలేని వాళ్లకు ఇలాంటి ఆలోచనలే రావు. అయినా, చావాల్సింది.. రెస్పాన్సిబుల్‌గా ఫీలయ్యే వాళ్లు కాదు, ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్. నీకు ప్రేమించే గుణం ఉంది.. తప్పు చేయవు, ఎవరైనా మాట అంటే తట్టుకోలేవు, ఆత్మాభిమానం ఎక్కువ, అందులోనూ ఇంటెలిజెంట్. దానికితోడు.. చచ్చే దమ్ముంది! ఇవన్నీ హీరో లక్షణాలు. నువ్వు హీరోవి. నువ్వు చచ్చిపోవడమేంటి. వి నీడ్ యూ.. సినిమాల్లో ఇలాంటి హీరోల్ని చూసి మేం విజిల్స్ వేస్తాం. అలాంటిది నువ్వు మా మధ్యలోనే ఉన్నావు. మాకు ఇంతకంటే ఏం కావాలి? నీ బాధను నేను అర్థం చేసుకుంటాను. నీ లైఫ్ మీనింగ్‌లెస్ అనిపించొచ్చు. మనుషులు, వాళ్ల డ్రామాలు నీకు చిరాకు తెప్పించవచ్చు. నువ్వు అన్నది నిజమే.. వేస్ట్ ఇదంతా. కానీ ఒకటి చెబుతాను.. నువ్వు ఏ ప్రాబ్లమ్ వల్ల చనిపోవాలని అనుకుంటున్నావో.. ఆ సమస్యను సాల్వ్ చేయ్. నిన్ను నమ్ముకున్నవాళ్లకు న్యాయం చేయ్. అప్పుడు కూడా చావాలనిపిస్తే.. చావు. కానీ ఓ చిన్న ప్రాబ్లెమ్ కోసం నా హీరో చచ్చిపోవడం నాకిష్టం లేదు. నేను నీ థియేటర్లోనే ఉన్నాను. నీ సినిమానే చూస్తున్నాను. నన్ను డిజప్పాయింట్ చేయొద్దు.
నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు..? ఆ నా కొడుకులను చావగొట్టు. నీకే కాదు వాళ్లు మాక్కూడా వేస్ట్ నా కొడుకులే. బట్ ప్రాబ్లమ్ కోసం చావొద్దు. అప్పులు చేశావా? వాళ్లు పీక్కు తింటున్నారా? వాళ్లొస్తే.. చెప్పు విప్పి చూపించు. ప్రేమించి మోసం చేశారా? చేస్తే చేయనివ్వు. ‘దే డోంట్ డిజర్వ్ యూ’. నువ్వు వెళ్లొద్దు.. నువ్వు నాకు కావాలి, నాకంటే ముందు నువ్వు పోవాల్సిన అవసరం లేదు. నీకు నాకు పెద్ద గ్యాప్ కూడా లేదు. రెండు రోజులు ముందు వెనకా.. అందరం కలిసి పోదాం. చుట్టూ చెత్త నా కొడుకులు నాకెందుకు.. నువ్వు కావాలి. గుర్తుంచుకో.. చావడానికి సిద్ధంగా ఉన్నా, ఎవడూ చంపలేడు! మనందరం లైఫ్‌లో చావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చావొద్దు.. మాక్కికిరికిరి’ అని పూరి వివరించారు.
‘లైఫ్ జీవించడానికి.. ముగించడానికి కాదు’ అంటూ పూరి ‘సూసైడ్’ చేసుకునేవాళ్లకు అద్భుతమైన మాటలు చెప్పాడు.