- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎకో ప్లస్ ఎకనామిక్ ఫ్రెండ్లీ.. e-సైకిల్
దిశ, ఫీచర్స్ : సంక్షోభాలే కొత్త మార్పులకు వేదికలవుతాయని చెప్పేందుకు కొవిడ్ మహమ్మారే ఓ ఉదాహరణ. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పని పరిస్థితులు, మానవ జీవన విధానంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకోగా.. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా పలు సంస్థలు ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నాయి. ప్రజలు కూడా ఈ తరహా వాహనాల వైపు మొగ్గు చూపుతుండటంతో ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) ఇండస్ట్రీకి నూతనోత్తేజం లభిస్తోంది. కాగా గతేడాది కరోనా ప్రభావం ఉన్నప్పటికీ e-వెహికల్ సేల్స్ 20% పెరిగినట్లు సొసైటీ ఆఫ్ మ్యానుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (SMEV) గణాంకాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు సమీప భవిష్యత్తులోనే మరో 5 శాతం మేరకు ఈ వాహనాల సేల్స్ పెరుగుతాయని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్న పుణె స్టార్టప్ కంపెనీ రూపొందించిన e-సైకిల్ విశేషాలేంటో తెలుసుకుందాం.
సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫాక్చరర్ కంపెనీలు రూపొందించే e-సైకిల్స్ టెక్నాలజీపరంగా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో కస్టమర్స్‌ను ఆకట్టుకునేలా ఉంటున్నాయి. రివర్స్ గేర్స్, థెఫ్ట్ అలారం, సైడ్ స్టాండ్ సెన్సార్స్, డబుల్ బ్యాటరీస్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్‌తో ఇండియన్ రోడ్స్‌కు సూటబుల్ అయ్యేలా, ధర కూడా తక్కువగా ఉండేలా మ్యానుఫాక్చర్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పుణెకు చెందిన అలాంటి స్టార్టప్ కంపెనీయే నెక్స్‌జు మొబిలిటీ(Nexzu Mobility). ఎలక్ట్రిక్ వెహికల్స్, సైకిల్స్ ప్రొడక్షన్ కోసం హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి అతుల్య మిట్టల్ 2015లో ఈ కంపెనీని ప్రారంభించాడు. అసలు ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..
భారత్‌లో అతిపెద్ద పిజ్జా రెస్టారెంట్ ఫ్రాంచైజ్ ‘పాపా జాన్స్ ఇండియా (Papa John’s India)’లో ఇన్వెస్టర్ అయిన అతుల్య.. పిజ్జా డెలివరికీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉపయోగిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఈ మేరకు వాటిపై రీసెర్చ్ చేసి, ఇందులో ఏయే చాలెంజెస్ ఉన్నాయో తెలుసుకున్నాడు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఇండియన్ మార్కెట్ కూడా ఉంటుందని గ్రహించి మొత్తానికి స్టార్టప్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో తాము రూపొందించే e-సైకిల్.. కస్టమర్లకు అతి తక్కువ ధరకు లభించడంతో పాటు ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా స్పెసిఫికేషన్స్ నిర్ధారించుకున్న తర్వాత ఎలక్ట్రిక్ సైకిల్స్ రూపొందించి 2018 మార్చిలో మార్కెట్‌లో విడుదల చేశాడు. కానీ కొవిడ్ కారణంగా ఊహించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ఆ తర్వాత గ్రాడ్యువల్‌గా అమ్మకాలు పెరిగాయి. రూ.50 ఖర్చుతో ఒక్కసారి చార్జ్ చేయించుకుంటే వీటిపై 1,000 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని అతుల్య తెలిపారు. పైగా వీటికి మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఉండవు. బేసిక్ సాకెట్స్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లకు వాడే చార్జర్లతో ఈ సైకిళ్లను ఎక్కడైనా చార్జ్ చేసుకోవచ్చు.
‘నెక్స్‌జు సంస్థ ఇండియన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండస్ట్రీకి బూస్టప్ ఇస్తోందని, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లోకల్ ప్లేసెస్‌లో త్వరలోనే మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు’ ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాహుల్ షోనక్ తెలిపారు. ఈ e-సైకిల్ ధర రూ.31,983/- నుంచి 42,317/- మధ్య ఉండగా, ఇందులో రెండు రకాలున్నాయి. రాంపస్(Rompus), రోడ్‌లార్క్(Roadlark). 26 ఇంచుల నైలాన్ టైర్స్, 36 వోల్టులు, 250 వాట్ల డీసీ మోటార్లు ఈ సైకిల్స్‌కు అమర్చారు. ఈ రెండు రకాల e-సైకిళ్లు పూర్తిస్థాయిలో చార్జ్ కావడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. రోడ్ లార్క్‌కు రెండు బ్యాటరీలుండగా, ఒకటి డిటాచబుల్ ఒకటి నాన్ డిటాచబుల్. సైకిళ్లలో అమర్చబడిన మోటార్, బ్యాటరీకి కంపెనీ 18 నెలల వారంటీ ఇస్తోంది. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న ఈ సందర్భంలో నెక్స్‌జు e-సైకిళ్లు చాలా ఉపయోగపడతాయని, ఈ సైకిల్ రోడ్డు మీద నడుపుతూ ఎగ్జైట్‌గా ఫీలయ్యానని నొయిడాకు చెందిన రితూ సింగ్ అభిప్రాయపడ్డారు. త్వరలో తమ నెక్స్‌జు ప్రొడక్ట్స్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.