- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధారాలుంటే తప్పులేదు: పురంధేశ్వరి
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడి పాత్రపై సరైన ఆధారాలు ఉంటే విచారణ జరగాల్సిందేనని బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెనాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేయడంపై ఆమె స్పందిస్తూ.. తప్పుచేస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. పక్కా ఆధారాలు ఉన్నప్పుడు ఇలాంటి అరెస్టులను ఎవరూ తప్పుబట్టబోరని స్పష్టం చేశారు. అవినీతి ప్రక్షాళన అనేది ప్రజాస్వామ్యంలో తక్షణ అవసరమని ఉద్ఘాటించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉండగా… ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ అంటూ ఓ పెద్ద పుస్తకం అచ్చువేయించారని, అందులోని అంశాలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్న ఆమె, ఆ పుస్తకంలో జీవోలతో సహా అవినీతి ఆరోపణలు చేశారని, వాటిపై అధికార వైఎస్సార్సీపీ చిత్తశుద్దిగా చర్యలు తీసుకోవాలని ఆమె సవాలు చేశారు.