- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచుఖండంలో కొత్త నాచుమొక్కలు.. ‘బ్రయం భారతీయెన్సిన్స్’గా నామకరణం
దిశ, ఫీచర్స్ : దాదాపు 40ఏళ్ల క్రితం 1984 సంవత్సరంలో అంటార్కిటికాలో భారతదేశం తన మొట్టమొదటి పరిశోధనా కేంద్రాన్ని స్థాపించినప్పుడు, అనేక సవాళ్లను ఎదుర్కొంది. 1990లో అది మంచులో కూరుకుపోవడంతో 1989లో మైత్రి, 2012లో భారతి పేర్లతో రీసెర్చ్ స్టేషన్లు ప్రారంభిచారు. అక్కడ నిరంతరం పరిశోధనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే పంజాబ్ విశ్వవిద్యాలయ జీవశాస్త్రవేత్తలు 2017లో ఈ మంచు ఖండంలో జరిపిన పరిశోధనల్లో నాచు జాతికి చెందిన కొత్త మొక్కలను కనుగొన్నారు. కానీ అవి కొత్త జాతి మొక్కలని నిర్ధరించడానికి వాళ్లు ఐదేళ్లు శ్రమించారు. ఈ పరిశోధనా ఫలితాలను ‘జర్నల్ ఆఫ్ ఆసియా-పసిఫిక్ బయోడైవర్సిటీ’ అనే ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు.
పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 2017లో గుర్తించిన కొత్త జాతి మొక్కల శాంపిల్స్ సేకరించి, ఐదేళ్ల పాటు దీని డీఎన్ఏ క్రమాన్ని పరిశీలిస్తూ (సీక్వెన్సింగ్), ఇతర మొక్కలతో పోల్చి చూస్తూ పరిశోధనలు జరిపారు. అయితే అంటార్కిటికా ప్రాంతంలో 100 కంటే ఎక్కువ రకాల నాచు మొక్కలుండగా, మోనార్క్ పెంగ్విన్స్ పెద్ద సంఖ్యలో పునరుత్పత్తి చేసే ప్రాంతంలో పెరిగిన కొత్త నాచు జాతి మొక్క ఇతర సాధారణ నాచులానే శాస్త్రవేత్తలు భావించారు. మొక్కలు జీవించడానికి పొటాషియం, సల్ఫర్, సన్‌లైట్, నీరుతో పాటు నైట్రోజన్ కూడా అవసరం కాగా 99శాతం మంచుతో కప్పబడిన ఈ ప్రాంతంలో ఆ మొక్కలు ఎలా మనుగడ సాధించాయన్నది పరిశోధకులకు సవాల్‌గా మారింది. ఈ కొత్త జాతి నాచు మొక్కలు పెంగ్విన్ మలంపై ఆధారపడి జీవించాయని, వాటి మలంలో సమృద్ధిగా నత్రజని ఉండటం, ఈ వాతావరణంలో అది కుళ్ళిపోదు కాబట్టి దాన్ని ఈ మొక్కలు వినియోగించుకున్నాయి. ఇక ఈ కొత్త జాతి మొక్కలకు ‘బ్రయం భారతీయెన్సిన్స్’ అని పేరుపెట్టడం విశేషం. అంటార్కిటికాలో ఉన్న భారతి పరిశోధన కేంద్రం మీదుగానే ఈ మొక్కలకు ఆ పేరు పెట్టారు.
‘మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు ఉండే అంటార్కిటికా ప్రాంతంలో మంచు కింద ఈ మొక్కలు ఎలా మనుగడ కొనసాగించాయన్నదే ఇంకా అంతు చిక్కని అంశం. నత్రజని వీటికి అందినా, మొక్కల ఎదుగుదలకు సూర్యరశ్మి అవసరం. సూర్యూడు లేని కాలాల్లో ఎండిపోయి, సూర్య కిరణాలు పడ్డాక మళ్లీ మొలకెత్తి ఉండొచ్చు. ఇక అంటార్కిటికాలో పచ్చదనం విస్తరిస్తోండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఇక్కడ మనుగడ సాగించలేకపోయిన సమశీతోష్ణ మొక్కలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ఖండం వేడెక్కుతోంది. ఒకవేళ మంచుఫలకాలు కరిగిపోతే వాటి కింద వ్యాధికారకమైన సూక్ష్మక్రిములు అనేకం బయటపడవచ్చు’ అని శాస్త్రవేత్తల బృందం భావించింది.