చర్లపల్లి జైలును సందర్శించిన పంజాబ్ మంత్రి.. ఎందుకంటే !

by Sumithra |
చర్లపల్లి జైలును సందర్శించిన పంజాబ్ మంత్రి.. ఎందుకంటే !
X

దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లను అధ్యయనం చేసేందుకు పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని జైళ్లలో ఖైదీల సత్ర్పవర్తనకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీని పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ఖైదీలు చదువుకోవడానికి జైళ్లల్లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు పరిశ్రమల యూనిట్లను స్థాపించినట్టు వివరించారు. శిక్షకాలం పూర్తి చేసుకున్న ఖైదీలకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకుల్లో ఉపాథి కల్పిస్తున్నామని అన్నారు. పంజాబ్ మంత్రి ఎస్‌హెచ్ సుఖ్జిందర్ ఎస్ రాండ్వా మాట్లాడుతూ చర్లపల్లి జైలు, ఓపెన్ ఏయిర్ జైలును సందర్శించినట్టు తెలిపారు. శుక్రవారం మరికొన్ని జైళ్లను పరిశీలిస్తామన్నారు. ఈ సదర్బంగా పంజాబ్ మంత్రికి రాష్ట్ర హోం హంత్రి మహమూద్ అలీ చార్మినార్ మెమెంటోను బహుకరించారు. కార్యక్రమంలో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది, ఐజీ సైదయ్య, పంజాబ్ జైళ్ల శాఖ అడిషనల్ డీజీపీ ప్రవీణ్ కె. సింహా, ఎస్పీఎస్ ఒబెరాయ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed