రైతులకు మద్దతుగా డీఐజీ రాజీనామా

by Shamantha N |
రైతులకు మద్దతుగా డీఐజీ రాజీనామా
X

ఛండీగడ్: నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ పంజాబ్ డీఐజీ లఖ్మిందర్ సింగ్ జాఖార్ రాజీనామా చేశారు. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశానని, త్వరలోనే తన రాజీనామా ఆమోదిస్తారని ఆశిస్తున్నట్టు ఛండీగడ్‌లో సేవలందిస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(జైళ్లు) లఖ్మిందర్ తెలిపారు. ‘నేను ముందు రైతును. తర్వాతే పోలీసును. పొలాల్లో రేయింబవళ్లు మా నాన్న కష్టపడితేనే నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను. అందుకే నేను వ్యవసాయానికి రుణపడి ఉన్నాను’ అని అన్నారు. లఖ్మిందర్ తన రాజీనామా ప్రిన్సిపల్ సెక్రెటరీ(జైళ్లు) డీకే తివారీకి అందించినట్టు అదనపు డీఐజీ ప్రవీణ్ కుమార్ సిన్హా ధ్రువీకరించారు. ఢిల్లీలో రైతు సహోదరుల ఆందోళనలో పాల్గొనాలని తన తల్లి ప్రోత్సహించిందని, రాజీనామాకైనా వెనుకాడవద్దని సూచించిందని లఖ్మిందర్ తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి చేరబోతున్నట్టు వివరించారు.

Advertisement

Next Story