- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మంగళవారం..
దిశ, వెబ్ డెస్క్: ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చరణ్ జిత్ చన్నీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను సాధారణ వ్యక్తినని, తనకు వీఐపీ స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదని, అలాగే తనకు కేటాయించిన సెక్యూరిటీ సిబ్బందిని, భారీ కాన్వాయ్ ని తగ్గించి ఆ డబ్బులను పేదల అభివృద్ధికి ఖర్చు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పారు.
అయితే తాజాగా పంజాబ్ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. “నేను ప్రతి మంగళవారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ కార్యాలయ అధికారులను నా కార్యాలయంలో కలుస్తాను. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ జరిగే వరకు ఆఫీస్ నుంచి ఎవరూ బయటకు రావొద్దని అధికారులందరికీ నేను ఆదేశించాను” అని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్.. సూపర్ సీఎం అంటూ హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.