కేంద్రంపై పంజాబ్ ముఖ్యమంత్రి ఫైర్

by Anukaran |
కేంద్రంపై పంజాబ్ ముఖ్యమంత్రి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశంలోని పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీలో గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. నెలల తరబడి రైతులు ఉద్యమం చేస్తున్న కేంద్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు ఉగ్రవాదుల్లా కనబడుతున్నారా అని మండిపడ్డారు. కొందరు అన్నదాతలకు, జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రైతులు వేర్పాటువాదులా లేక టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతోందని, కానీ దీనివల్ల వారి ఆందోళన మరింత ఉధృతమవుతుంది తప్ప తగ్గదని ఆయన అన్నారు. ఇది వారిని రెచ్చగొట్టినట్టే అవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed