దుల్కర్ తో పూజ.. క్రేజీ కోంబో..

by Shyam |
దుల్కర్ తో పూజ.. క్రేజీ కోంబో..
X

పూజా హెగ్డే… టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపొయింది. ఈ భామ ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేస్తే చాలు హిట్ అనేంత క్రేజ్ తెచ్చుకుంది. టాప్ హీరోలు అంత పూజ జపం చేస్తుండగా.. ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటుంది. టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకున్న పూజ.. ప్రభాస్ ఓ డియర్, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఎప్పటి నుంచో తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అది ఇప్పటికి నిజమయ్యేలా కనిపిస్తుండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజను ఎంచుకున్నారట. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వనీదత్ నిర్మించనున్నారు. కాగా లాక్ డౌన్ ఎత్తేయగానే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే చాన్స్ ఉంది.

Advertisement

Next Story