మా దగ్గర ఒక్క కరోనా కేసు లేదు..హోం డెలివరీ చేస్తాం : మాల్లాడి

by srinivas |
మా దగ్గర ఒక్క కరోనా కేసు లేదు..హోం డెలివరీ చేస్తాం : మాల్లాడి
X

తమ దగ్గర ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలని సూచించారు. అలా చేస్తేనే కరోనా అదుపులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చేపడుతున్న చర్యలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ ఏప్రిల్‌ 14 నాటికి పూర్తయ్యే అవకాశం లేదని.. ఇది మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణకు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.

అయితే కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్రం కంటే ముందుగానే తమ పుదుచ్చేరి సీఎం నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించార అందుకే నేటి వరకు పుదుచ్చేరి పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు. కేరళలో ఉన్న మాహీలో మాత్రమే ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైందని ఆయన గుర్తు చేశారు. ఆ కేసులో కూడా సకాలంలో సరైన వైద్యం అందడంతో పాజిటివ్ నుంచి నెగిటివ్‌‌కు మారిందని ఆయన వెల్లడించారు.

కరోనా తమ రాష్ట్రంలో ప్రబల కుండా ఉండేందుకు యానాంలో లక్ష మందికి మాస్క్‌లు, సబ్బులు పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా యానాంలో ఉన్న 22 రేషన్‌షాపులతో పాటు, ఐదు కోపరేటివ్‌ లిక్కర్‌ షాపులను కూడా మూసేశామని ఆయన తెలిపారు. ప్రజలకు రేషన్‌తో పాటు నిత్యావసరాలను కూడా ప్రభుత్వమే అందుబాటులో ఉంచిందని ఆయన వెల్లడించారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తే ఆ సరుకులను హోల్‌సేల్‌ ధరలకే హోం డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.

Tags : puducherry, yanam, health minister, malladi krushnarao, kakinada, corona

Advertisement

Next Story

Most Viewed