- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎంపీ అరవింద్‌ను నిజాంబాద్ చౌరస్తాలో బట్టలూడదీసి తిప్పుతా’
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎంపీ అరవింద్‌ను నిజామాబాద్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బట్టలూడదీసి తిప్పుతానని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. ఓవైసీ పెంపుడు కుక్క కేసీఆర్ అని ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అరవింద్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రకటనలు మానుకోవాలని సూచించారు. లేకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ‘దళితబంధు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. దళితులు అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో దళితుల సంక్షేమానికి చేసింది శూన్యమన్నారు. టీఆర్ఎస్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ‘దళితబంధు’ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నిష్ప్రయోజనమైనని తెలిపారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను స్వీకరించాలని సూచించారు. ఫాదర్ అఫ్ ది కరప్షన్ పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. ఆ పార్టీకి తెలంగాణలో మనుగడ లేదన్నారు.