టీఆర్ఎస్, బీజేపీలపై ప్రజల్లో వ్యతిరేకత

by Ramesh Goud |
Uttham kumar Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్, బీజేపీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని గ్రేటర్ హైదరాబాద్‌లోని లింగోజీగూడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో స్పష్టమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగం చేసినా కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు. లింగోజీగూడ కార్పొరేటర్‌గా విజయం సాధించిన దర్పల్లి రాజశేఖర్‌‌కు సోమవారం ఫోన్ చేసి అభినందించారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటై కలిసి పోటీ చేశాయని ఆ పార్టీల కుట్రలను భగ్నం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

Advertisement

Next Story