మంత్రి తలసానికి చేదు అనుభవం..

by Shyam |   ( Updated:2020-10-23 05:42:20.0  )
మంత్రి తలసానికి చేదు అనుభవం..
X

దిశ, వెబ్‌డెస్క్ :హైదరాబాద్‌లో వచ్చిన వరదల వలన సిటీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు నిరసన సెగ తగిలింది. గోషామహల్‌ నియోజకవర్గం అబిడ్స్‌ చీరగ్‌ గల్లీ నేతాజీ నగర్‌లో వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేసేందుకు స్థానిక భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి మంత్రి వెళ్లారు.

అక్కడి సమస్యలను మంత్రికి చెప్పుకునేందుకు వచ్చిన స్థానిక బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా ఆందోళనకు దిగి ప్రభుత్వానికి, మంత్రి తలసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెక్కులను టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని.. బాధితులకు ప్రభుత్వ సాయం అందడం లేదని స్థానిక మహిళలు ఆరోపించారు. బస్తీ కమిటీ నిర్ణయం మేరకు బాధితులందరికీ చెక్కులను అందిస్తామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్‌, స్థానిక కార్పొరేటర్ మమత సంతోష్‌ గుప్తతో కలిసి వరద బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయాన్ని మంత్రి అందించారు.

Advertisement

Next Story

Most Viewed