- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే పని చేసేదెప్పుడు..?
దిశ, నల్లబెల్లి: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అభివృద్ధిపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నల్లబెల్లి మండల కేంద్రంలోని పలు కాలనీల్లో రోడ్ల పరిస్థితి అద్వానంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. గత ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా గెలిపిస్తే కాలనీకి రోడ్డు వేయిస్తానని కొబ్బరికాయ కొట్టిన సుదర్శన్ రెడ్డి.. గెలిచిన తర్వాత హామీ నెరవేర్చలేదన్నారు. ఎన్నికలు జరిగి నేటికి మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటివరకు రోడ్డు వేయకపోవడంతో కాలనీ వాసులు విమర్శిస్తున్నారు. కాలనీ రోడ్లు మొత్తం బురదమయంగా మారాయని.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దృష్టి సారించి కాలనీలో ప్రధాన సమస్యగా మారిన సీసీ రోడ్డు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.