జనచైతన్య రథం ప్రారంభించిన చీఫ్ విప్

by vinod kumar |
జనచైతన్య రథం ప్రారంభించిన చీఫ్ విప్
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులతో ఏర్పాటు చేసిన జనచైతన్య రథాన్ని ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‌ఆయన మాట్లాడుతూ.. నగరంలో కొంత మంది యువకులు కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తూ రోడ్ల పై తిరుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిరంతరం సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, ఎలక్ట్రిసిటీ, పారిశుధ్య కార్మికులకు సహకరించాలని కోరారు. కరోనా నియంత్రణకు సామాజిక దూరం, పరిశుభ్రత మాత్రమే ఔషధమనీ, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.

Tags; chief whip, dasyam vinay kumar, warangal, praja chaitanya ratham, corona, virus

Advertisement

Next Story