పీఎస్ఎల్ మరోసారి వాయిదా

by Shyam |
PSL
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మరోసారి వాయిదా పడింది. పలువురు ఆటగాళ్లు కోవిడ్-19 బారిన పడటంతో నిర్వహకులు పీఎస్ఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాది మార్చిలో పీఎస్ఎల్ 5వ ప్రారంభమయ్యాక కరోనా కారణంగా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు వాయిదా వేశారు. చివరకు వాటిని 2020 నవంబర్‌లో నిర్వహించారు. ఇక తాజాగా 6వ సీజన్ ప్రారంభించగా సగం మ్యాచ్‌లు కూడా జరగక ముందే పీఎస్ఎల్‌ను వాయిదా వేశారు. ఫిబ్రవరి 20న 6వ సీజన్ ప్రారంభం కావల్సి ఉండగా.. ఒక్క రోజు ముందు లాహోర్ కలందర్స్ ఆటగాడు కరోనా పాజిటివ్‌గా నిర్దారించబడ్డాడు. తాజాగా వేర్వేరు ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో వెంటనే పీఎస్ఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, మిగతా మ్యాచ్‌లను మే నెలలో నిర్వహిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే అదే సమయంలో ఐపీఎల్ కూడా జరుగుతుండటంతో ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story