మాజీ సీఎంలపై పీఎస్ఏ ప్రయోగం

by Shyam |
మాజీ సీఎంలపై పీఎస్ఏ ప్రయోగం
X

రు నెలలుగా నిర్బంధంలోనే ఉన్న జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై కఠినమైన ప్రజా భద్రత చట్టం(పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌-పీఎస్‌ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరి కొన్నిగంటల్లో వారి నిర్బంధం ముగియనుండగా ఈ చట్టం ప్రయోగించడం గమనార్హం. వీరిద్దరిపైనే కాకుండా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అలీ మహమ్మద్‌ సగర్‌పై, పీపుల్స్ డెమోక్రటిక్స్ పార్టీ (పీడీపీ) సర్తాజ్‌ మదానీలపైనా పీఎస్‌ఏ చట్టం ప్రయోగిస్తున్నట్టు నోటీసులు జారీచేశారు. కాగా, 1978లో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి వల్ల సమాజానికి ప్రమాదం అని భావిస్తే, అతనిపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే కనీసం మూడు నెలలు, అంతకన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచవచ్చు.

Advertisement

Next Story

Most Viewed