- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి పీఎఫ్ నుంచి అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు ఇచ్చిన కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ) కొవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్ పరిణామాలకు ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేతనజీవులకు ఊరట కల్పించే వార్త అందించింది. గతేడాది తరహాలోనే ఈ ఏడాది సైతం ఈపీఎఫ్ఓ చందాదారులు తమ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. గతేడాదిలో ఇదే సదుపాయం కల్పించిన ప్రభుత్వం మూడు నెలల బేసిక్, డీఏ వేతనం లేదంటే పీఎఫ్ మొత్తంలో 75 శాతం నగదును ఏది తక్కువైతే దాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది.
సోమవారం ప్రకటనలో ఇదే సదుపాయాన్ని మరోసారి ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ‘భవిష్య నిధి చందాదారులకు అడ్వాన్స్ మొత్తాన్ని తీసుకోవడం కరోనా సమయంలో ఎంతో సహాయంగా ఉంటుంది. ముఖ్యంగా రూ. 15 వేలలోపు జీతం ఉన్నవారికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 76.31 లక్షల కరోనా అడ్వాన్స్ క్లైమ్‌లను పరిష్కరించడానికి రూ. 18.5 వేల కోట్లకుపైగా చెల్లింపులు జరిపినట్టు’ కార్మిక శాఖ వివరించింది. అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం 3 రోజుల్లోగా పరిష్కారాలను కల్పిస్తున్నట్టు వెల్లడించింది.