సైనికులతో రాజ్‌నాథ్ సింగ్ చర్చలు

by Shamantha N |
సైనికులతో రాజ్‌నాథ్ సింగ్ చర్చలు
X

శ్రీనగర్: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం జమ్ము కశ్మీర్‌లోని ఎల్‌వోసీ సరిహద్దు‌లో పర్యటించారు. కుప్వారా జిల్లాలోని ఫార్వర్డ్ పోస్టుకు వెళ్లిన ఆయన అక్కడ సైనికులతో చర్చించారు. ఎలాంటి పరిస్థితుల్లోనై దేశ రక్షణకు పాటుపడే ధైర్య సాహసాలున్న సైన్యాన్ని చూసి గర్వపడుతున్నారని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అన్నారు. సైనికులతో కలిసి ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. కుప్వారా పోస్టుకు వెళ్లకముందు ఆయన అమర్‌నాథ్ గుహకు వెళ్లారు. అక్కడ అమర్‌నాథుడిని దర్శించుకుని సుమారు గంటసేపు ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు. అనంతరం ఎల్‌వోసీకి చేరారు. జమ్ము కశ్మీర్‌లోని రక్షణ పరిస్థితులపై మిలిటరీ టాప్ అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడిన బుద్ది చెప్పాలని రక్షణ మంత్రి సూచించారు. ఎల్‌వోసీలో సైన్యం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, పాక్ కవ్వింపు చర్యలపై కన్నేసి ఉంచాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed