ఒలింపిక్స్ రద్దు చేయాలంటూ టోక్యోలో భారీ నిరసన

by Shiva |
ఒలింపిక్స్ రద్దు చేయాలంటూ టోక్యోలో భారీ నిరసన
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ కోసం నిర్మించిన నేషనల్ స్టేడియం వెలుపల ఆదివారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. కరోనా మహమ్మారి వేగంగా విస్తరించడంతో పాటు, మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో ఒలింపిక్స్ నిర్వహించడం సబబు కాదంటూ వందల సంఖ్యలో నిరసన కారులు యాంటీ-ఒలింపిక్స్ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించి ఆదివారం నేషనల్ స్టేడియంలో ట్రయల్ రన్ నిర్వహించారు. దాదాపు 420 మంది అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వీరిలో 8 మంది విదేశీయులు ఉన్నారు. వరల్డ్ అథ్లెటిక్స్ గవర్నింగ్ బాడీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగగా.. ఐవోసీ సభ్యుడు, రెండు సార్లు ఒలంపిక్ పతకం గెలుచుకున్న కో హెడ్ వీటి నిర్వహణ బాధ్యతలు చూశారు. ఈ విషయం తెలుసుకున్ నిరసన కారులు స్టేడియం వెలుపల భారీ ప్రదర్శన చేశారు. ఒలింపిక్స్ వల్ల పేదలు చనిపోతారు, ఒలింపిక్స్‌ను రద్దు చేయడం వంటి నినాదాలతో నిరసన కారులు హోరెత్తించారు.

Advertisement

Next Story

Most Viewed