‘అగ్గిపెట్టె హరీశ్‌రావు’.. భగ్గుమన్న బీజేపీ శ్రేణులు

by Sridhar Babu |   ( Updated:2023-05-27 03:32:55.0  )
minister harish rao
X

దిశ, జమ్మికుంట: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను నిరిసిస్తూ వీణవంకలో బీజేపీ నాయకులు ‘అగ్గిపెట్టె హరీశ్‌రావు’ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న ఈటల రాజేందర్ ఇకనుండి వీల్ చైర్‌లో కూర్చుని ఎన్నికల ప్రచారం చేస్తూ డ్రామాలు ఆడతారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహానికి గురి చేశారు. దీంతో మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండల కేంద్రంలో బీజేపీ నాయకులు హరీష్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు.

ఇది గమనించిన పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నాయకులను పోలీసులు స్టేషన్ కు తరలించారు. కాగా జమ్మికుంట-కరీంనగర్ ప్రధాన రహదారి వెంట జరిగిన ఈ సంఘటన వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నిరసనలో బీజేపీ నాయకులు రామిడి ఆదిరెడ్డి, పెద్ది మల్లారెడ్డి, నరసింహ రాజు, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed