అందుకే రోడ్డెక్కాం.. కనీసం కాలకృత్యాలకు కూడా అవి లేవు

by Shyam |
అందుకే రోడ్డెక్కాం.. కనీసం కాలకృత్యాలకు కూడా అవి లేవు
X

దిశ, షాద్ నగర్: తమ కాలనీలో గత నాలుగు రోజులుగా నీటి కోసం ఇబ్బందులేదుర్కొంటున్నా పట్టించుకోవడంలేదంటూ కాలనీవాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో 8వ వార్డులో గత నాలుగు రోజులుగా మంచినీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్థానికులు ఎన్నిసార్లు పాలకులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో గత్యంతరం లేక ఆ కాలనీకి చెందిన మహిళలు, స్థానికులు ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించామని చెప్పారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకొనేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని కోరారు.

Advertisement

Next Story