‘వలస కార్మికుల్ని ఆదుకోవాలి’

by Shyam |
‘వలస కార్మికుల్ని ఆదుకోవాలి’
X

దిశ, వరంగల్: వలస కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శనివారం జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏవో విశ్వ ప్రసాద్ అందజేశారు. వారు మాటాడుతూ కరోనా, లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణలో సుమారు 12 లక్షల మంది వలస కార్మికులు పని చేస్తున్నారని చెప్పారు. వీరిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కార్మికులు తిండి, నీళ్లు లేకుండా వందల కిలోమీటర్లు ఖాళీ నడకన బయలుదేరి ప్రాణాలు పోగొట్టుకున్నారని, తాజాగా రైలు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను ఆదుకునేందుకు సత్వరమే తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్‌లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed