టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. 

by Shyam |   ( Updated:2023-07-11 15:05:02.0  )
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. 
X

దిశ, మానకొండూరు : మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ని‌ ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయసు 61 ఏళ్లకు పెంచడంపై నిరసన వ్యక్తం చేశారు. దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల యువతకు ఉపాధి అందే అవకాశాలు లేవన్నారు. ఘటన స్థలంలో ఉన్న పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Next Story