ఆ బ్యాంక్‌ పై అంతస్థులో వ్యభిచారం.. పోలీసులు ఏం చేశారంటే..?

by Sumithra |   ( Updated:2021-09-07 08:04:11.0  )
ఆ బ్యాంక్‌ పై అంతస్థులో వ్యభిచారం.. పోలీసులు ఏం చేశారంటే..?
X

దిశ, కంటోన్మెంట్: గుట్టు చప్పుడుకాకుండా నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై బోయిన్‌పల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వహకుడితో పాటు ఓ విటుడు, మరో అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ బోయిన్‌పల్లి ప్రధాన రహదారిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్.. పై అంతస్థులో బీహార్‌కు చెందిన బీరేందర్ షా గుట్టుగా వ్యభిచార గృహం నడుపుతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు. ఈ రైడ్స్‌లో బీరేందర్ షాతో పాటు మల్కాజిగిరికి చెందిన విటుడు ప్రశాంత్, ఓ అమ్మాయి(21)లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 4 వేల నగదు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని బీరేందర్ షా, విటుడిని రిమాండ్‌కు తరలించగా.. అమ్మాయిని రెస్క్యూ హోంకు తీసుకెళ్లారు పోలీసులు. కాగా, పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed