- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాజెక్ట్‌ల అనుమతి అపెక్స్ కౌన్సిల్‌కే ఉంది
దిశ, వెబ్‌డెస్క్: విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్టులు నిర్మించాలన్నా వాటికి అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కే ఉందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత కేంద్రమంత్రి షెకావత్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న జల వివాదాల పరిష్కరానికి ఇద్దరు సీఎంలు సహకరించారని, విభజన చట్టం ప్రకారమే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని ఇద్దరు సీఎంలను కోరితే సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. సమావేశంలో నాలుగు అజెండా అంశాలపై పూర్తిగా చర్చ జరిపామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అటు పోలవరం ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేయాలన్నదే మా సూచన అని, బిల్లులు ఇచ్చిన మేరకు నిధులు విడుదల చేశామన్నారు. వీలైతే ఈనెలాఖరులో పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తానని కేంద్రమంత్రి తెలిపారు.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోని జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో మంగళవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగ్గా..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్‌కు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి పాల్గొనగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12గంటలకు సమావేశమైన అపెక్స్ కౌన్సిల్ దాదాపు 2గంటల పాటు కొనసాగింది.