- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.. కోదండరాం కీలక ప్రకటన
దిశ, హన్మకొండ టౌన్: సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 9, 10, 11వ తేదీల్లో నిర్వహిస్తున్న సింగరేణి సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈనెల 7వ తేదీన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన దీక్ష చేస్తామని ప్రకటించారు. సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు మాత్రమే కాదని, దానిపై అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. సింగరేణిని ప్రవేటీకరించి ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి ప్రధాని మోడీ పూనుకున్నారని ఆరోపించారు.
దీని మూలంగా ప్రకృతి విధ్వంసానికి, పర్యవరణానికి పెద్దు ముప్పు పొంచి ఉందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు దేశవ్యాప్తంగా కలిసి వచ్చే అన్ని పార్టీలతో హైదరాబాద్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు, అధికారంలో కూర్చొని ఆస్తులు కూడబెట్టుకుంటుంటే, పాల్గొన్న మేము నేటికీ ఉద్యమాలు చేస్తున్నామని తెలిపారు. రాష్టంలో ఈ రాజకీయాలు మారాలని, తెలంగాణ బాగుపడాలని కోరుకొంటున్నానని అన్నారు.